నేటి నిర్భయ


స్త్రీని గౌరవించువాడు తల్లిని ప్రేమిస్తాడు. 
తల్లిని ప్రేమించువాడు తాను పుట్టిన దేశాన్ని ప్రేమిస్తాడు. 
తాను పుట్టిన దేశాన్ని ప్రేమించువాడు, తోటి మనిషిని ప్రేమిస్తాడు. 
తోటి మనిషిని ప్రేమించువాడు, మనిషి మనిషికే పుడతాడు కుల మతాలకు కాదు అని జీవిస్తాడు. 
మానవ సృష్టిని సృష్టించే స్త్రీని గౌరవించలేని సమాజం,  సమాజమే కాదు. 
స్త్రీని గౌరవించలేనివాడు, క్రూర మృగం కంటే భయంకరంగా జీవిస్తాడు. 

సృష్టిలో స్త్రీ లేనిదే ఈ భూమి మీద మనిషి జన్మే సాధ్యం కాదు, అలాంటి సృష్టికర్త స్త్రీకి మన మానవ సమాజంలో ఇస్తున్న గౌరవం ఎంత ?

స్త్రీకి గౌరవం, రక్షణ ఇవ్వలేని సమాజం, ఒక సమాజం అవుతుందా?

సృష్టికర్త ఒక  బ్రహ్మ, ఆ బ్రహ్మను సృష్టించింది ఒక అమ్మ, ఆ అమ్మకే రక్షణ ఇవ్వలేని సమాజం ఒక సమాజమేనా ?  అంటూ ప్రశ్నించటమే కాదు, శిక్షించటం మాకు తెలుసు అని నిరూపించిన నేటి స్త్రీ చరిత్రే ఈ నేటి నిర్భయ ... 






Comments